epaper
Wednesday, February 18, 2026
epaper

రాష్ట్ర ఎన్నికల కమిషన్​ ఉందా? : కిషన్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్​ ఉందా? అని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ఓవైపు మున్సిపల్​ ఎన్నికలు జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్​ లను బదిలీ చేసిందని ధ్వజమెత్తారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జీహెచ్​ఎంసీలో మూడు కార్పొరేషన్​ లను చేశారని, ఇది ఎన్నికల కోడ్​ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ‘ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉందా?’ అంటూ ప్రశ్నించారు. ఇక స్టేట్ ఎలక్షన్​ కమిషన్ (SEC)​ ఎందుకు అని కిషన్​ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Read Also: రాహుల్​ గాంధీకి ప్రివిలేజ్​ నోటీస్!​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>