కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందా? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ఓవైపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ లను బదిలీ చేసిందని ధ్వజమెత్తారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీలో మూడు కార్పొరేషన్ లను చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ‘ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉందా?’ అంటూ ప్రశ్నించారు. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ (SEC) ఎందుకు అని కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
Read Also: రాహుల్ గాంధీకి ప్రివిలేజ్ నోటీస్!
Follow Us On: X(Twitter)


