epaper
Wednesday, February 18, 2026
epaper

భూపాలపల్లి పోలింగ్​ కేంద్రం వద్ద ఉద్రిక్తత

కలం, వెబ్​ డెస్క్​ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ భూపాలపల్లి (Bhupalpally)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం సమీపంలో బీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని స్థానికులు ఆరోపించడంతో అక్కడ గందరగోళం నెలకొంది.

ఈ ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. పోలీసుల రాకను గమనించిన అభ్యర్థి బంధువులు తాము తెచ్చిన నగదును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సుమారు లక్ష రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>