Mobile Popup Ad
Mobile Popup Ad

జగిత్యాలలో బీజేపీ రెబల్ అభ్యర్థి కంటతడి.. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆవేదన

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు(Municipal Elections) కొనసాగుతున్నాయి. ప‌లుచోట్ల పోటీలో ఉన్న‌ పార్టీల‌ నేత‌ల మ‌ధ్య వాగ్వాదాలు, గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జగిత్యాల(Jagtial)లో పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ రెబల్ అభ్యర్థి (BJP Rebel Candidate) కంటతడి పెట్ట‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది. స్వతంత్ర అభ్యర్థి దొంగ ఓటర్లకు ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారని బీజేపీ రెబల్ అభ్యర్థి పులి శ్రీధర్ ఆరోపిస్తున్నారు. పోలీసుల ముందే త‌న త‌ల్లితో క‌లిసి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నార‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఏం పాపం చేశామ‌ని, ఎందుకు ఇంత టార్చ‌ర్ పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న ఫోన్ కూడా లాక్కుపోయార‌ని శ్రీధ‌ర్ వెల్ల‌డించారు. పోలీసులు శ్రీధ‌ర్‌ను స‌ముదాయించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>