epaper
Wednesday, February 18, 2026
epaper

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండ్ల గణేశ్

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (Bandla Ganesh) 23 రోజుల పాటు 535 కిలోమీటర్ల మేర సంకల్ప పాదయాత్ర(Sankalpa Padayatra) చేసి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేసిన అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ప్రారంభమైన ఈ సంకల్ప పాదయాత్రను బండ్ల గణేశ్ ప్రతిరోజూ కఠిన నియమాలతో కొనసాగించారు.

మార్గం మధ్యలో భక్తులని  కలుసుకుంటూ, గోవింద నామస్మరణ చేస్తూ తిరుమలకు చేరుకున్నారు. తిరుమల చేరుకున్న అనంతరం ఆలయ అధికారులు బండ్ల గణేశ్‌కు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ.. “ఈ పాదయాత్రను ఒక సంకల్పంగా ప్రారంభించాను. స్వామివారి కృపతో విజయవంతంగా పూర్తిచేసి దర్శనం పొందడం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>