కలం, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping).. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. అధికారుల కెరీర్ ను అయోమయంలో పడేసింది. రాజకీయ నాయకులు పదవులు కోల్పోయేలా చేసింది. ప్రభుత్వాలను కూల్చేసింది. పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసింది! సరిగ్గా 40 ఏండ్ల కింద కర్నాటకలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నాటి సీఎం రామకృష్ణ హెగ్డేను (Ramakrishna Hegde) చుట్టు ముట్టాయి. ఏకంగా ఆయన పదవికే ఎసరు తెచ్చాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోనూ ఇలాంటి ఆరోపణలే! స్వయంగా నాటి సీఎం కేసీఆర్ (KCR) కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. ఇది ఏవైపు దారితీస్తుందోనని బీఆర్ఎస్ ఆందోళన చెందుతున్నది. కర్నాటక, తెలంగాణలోనే కాదు.. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లోనూ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వివాదాలు ఉన్నాయి. వాటి పర్యవసానాలు ఇంకా వెంటాడుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ ఎడిషన్ కోసం కింద ఉన్న ఇమేజ్ పైన క్లిక్ చేయండి.
Read Also: సీఎం రేవంత్‌కు ఆరు నెలలు బోనస్
Follow Us On: Sharechat



