epaper
Wednesday, February 18, 2026
epaper

కత్తులతో పొడిచి షాపులోనే బియ్యం వ్యాపారి దారుణ హత్య

కలం, వెబ్​డెస్క్​: మరో రెండు రోజుల్లో ఎన్నికలు. అయినా, బంగ్లాదేశ్ ​(Bangladesh) లో హిందువులపై హత్యాకాండ ఆగడం లేదు. గతేడాది నుంచి ఇప్పటివరకు అల్లరి మూకల చేతిలో హిందువులు పదుల సంఖ్యలో హత్యకు గురికాగా, మంగళవారం మరో వ్యక్తి ప్రాణాలు విడిచారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెమైన్​సింగ్​ జిల్లా సౌత్​కాండ గ్రామానికి చెందిన సుశేన్​ చంద్ర సర్కార్​(62)కు త్రిషల్​ ఉప జిల్లా బోగర్​ బజార్​లో ‘మెస్సర్స్​ భాయ్​ ఎంటర్​ప్రైజెస్​’ పేరుతో రైస్​ ట్రేడింగ్​ షాప్​ నడుపుతున్నారు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి 11గంటల సమయంలో కొందరు దుండగులు కత్తులతో దుకాణంలోకి చొరబడ్డారు. సుశేన్​పై (Sushen Chandra Sarkar) విచక్షణా రహితంగా దాడి చేశారు. కత్తులతో శరీరమంతా పొడిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం దుండగులు షాప్​ షట్టర్​ మూసేసి పరారయ్యారు. మరుసటి రోజు స్థానికులు గమనించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, బంగ్లాదేశ్​ (Bangladesh) లో మహ్మద్​ యూనస్​ నేతృత్వలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారత వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి నేత, ఇంక్విలాబ్​ మోంచో నాయకుడు ఉస్మాన్​ హాదీతో మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. ఓ ఫ్యాక్టరీలో పనిచేసే దీపూ చంద్ర దాస్​ను కొట్టి, చెట్టుకు కట్టేసి తగలబెట్టడంతో మొదలైన ఈ దురాగతాలు ఇప్పటికీ ఆగడం లేదు.

Read Also: ఆంథ్రోపిక్​ కీలక ఉద్యోగి రాజీనామా.. టెక్ వరల్డ్​లో కలకలం

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>