కలం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ కు (Phone Tapping) పాల్పడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti) సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడితోటల్లో, ఫామ్ హౌస్‌ల్లో ఎక్విప్మెంట్ను దాచి ఇప్పటికీ నేతల ఫోన్ సంభాషణలను వింటున్నారని ఆరోపించారు. తప్పకుండా వారందరి లెక్కలు తీస్తామని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మంగళవారం ఖమ్మంలో మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికీ బీఆర్ ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు వాళ్ల దగ్గర ఉన్నట్లు అనిపిస్తున్నది.
ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. ఇంకా ఎన్ని ఎక్విప్ మెంట్లు ఏయే మామిడి తోటల్లో, ఏయే ఫామ్‌హౌస్‌లలో, ఏయో ఇళ్లలో ఉన్నాయో.. ఇంకా ఎంత మంది ఫోన్ కాల్స్ ఎవరు వింటున్నారో తప్పక ఎంక్వరీ చేయిస్తాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని ఆయన తేల్చిచెప్పారు. పదేండ్లలో గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిందని, దాన్ని తాము చక్కదిద్దుతున్నామని తెలిపారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండదండగా ఉంటున్నారని ఆయన (Minister Ponguleti) చెప్పారు.
Read Also: సీఎం రేవంత్ రెడ్డికి కవిత సవాల్.. ఆ హామీపై చర్చకు సిద్ధమేనా?
Follow Us On: Sharechat


