epaper
Wednesday, February 18, 2026
epaper

టీ20 వరల్డ్‌కప్‌ వేళ UAE సంచలనం.. షోయబ్‌కు షాక్

కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) మ్యాచ్‌కు ముందు యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్‌తో పోరుకు గంటల ముందే బ్యాటర్ షోయబ్‌‌ఖాన్‌ (Shoaib Khan)ను  జట్టు నుంచి తొలగించి ఇంటికి పంపేసింది. ఫిబ్రవరి 9న ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. క్రమశిక్షణ కారణాలనే బోర్డు పేర్కొంది. అయితే పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ పరిణామం జట్టులో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇది అంతర్గత వ్యవహారమేనని వర్గాలు చెబుతున్నాయి. జట్టుతో షోయబ్ సరిగా కలిసిపోలేదన్న చర్చ నడిచింది. అతిగా మద్యం సేవించడం, వ్యక్తిగత జీవితం సంబంధిత సమస్యలే కారణమన్న కథనాలు వెలువడ్డాయి.

మరోవైపు తన పాకిస్థాన్ నేపథ్యం కారణంగా వివక్ష చూపారని షోయబ్ ఆరోపించినట్టు సమాచారం. షోయబ్ (Shoaib Khan) యూఏఈకి మిడిల్ ఆర్డర్‌లో కీలక ఆటగాడు. 16 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేశాడు. ఇటీవల వార్మ్‌అప్ మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. ఈ అంశంపై జట్టు ఐక్యత దెబ్బతిందన్న ప్రచారాన్ని కెప్టెన్ మహమ్మద్ వసీమ్ ఖండించినట్టు తెలిసింది. జట్టు అంతా ఒక కుటుంబంలా ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ పరిణామాల మధ్య UAE జట్టు ఇప్పుడు టోర్నీపై దృష్టి పెట్టింది.

Read Also: ఆయుష్ మాత్రేకు క్రికెట్ గాడ్ సచిన్ సూపర్ గిఫ్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>