బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించడానికి ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) నో చెప్పారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ పార్టీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఊహించనన్ని స్థానాలు కూడా దక్కలేదు. ఈ ఎన్నికలో ఆర్‌జేడీ(RJD) కేవలం 25 స్థానాలకే పరిమితం అయింది. ఈ ఓటమికి బాధ్యత వహించాలని తేజస్వీ భావించారు. అందుకే ప్రతిపక్ష నేత హోదాను స్వీకరించడానికి నిరాకరించారు. కాగా ఈ విషయంలో ఆర్‌జేడీ స్థాపకుడు, తేజస్వీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ జోక్యం చేసుకున్నారు. తన కుమారుడికి సర్దిచెప్పడంతో.. తండ్రి మాట కాదనలేక తేజస్వీ ఓకే చెప్పారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ప్రతిపక్ష నేత హోదా ఎవరికి ఇవ్వాలి అన్న అంశంపై సోమవారం ఆర్జేడీ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. అందులో బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేలు 25 మంది తేజస్వీ(Tejashwi Yadav)ని తమ శాసనసభాపక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ ప్రకటించాడు. కాగా తొలుత అందుకు తేజస్వీ అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. తాను ఇప్పటికి కేవలం ఎమ్మెల్యే పాత్రపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నానని, ప్రతిపక్ష నాయకుని బాధ్యత చేపట్టాలనే ఆసక్తి లేనట్టు తేజస్వీ చెప్పినట్లు నాయకులు అనుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎంత కృషి చేసినా ఫలితం దక్కలేదని, పరాజయానికి తానే పూర్తి బాధ్యత తీసుకుంటానని ఆయన అభిప్రాయపడ్డట్టు తెలిపారు. అయితే పార్టీ ముందుకు సాగేందుకు ప్రతిపక్ష నేతగా కొనసాగాలనే లాలూ సూచించడంతో తేజస్వీ చివరికి అంగీకరించాడు.
Read Also: హసీనాకు మద్దతుగా బంగ్లాలో నిరసనలు
Follow Us on: Youtube

