epaper
Wednesday, February 18, 2026
epaper

బావబామ్మర్దులకు జైల్ సెంటిమెంట్… చిట్‌చాట్‌లో సీఎం రేవంత్

కలం, తెలంగాణ బ్యూరో : బహిరంగ వేదికల మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా కేటీఆర్, హరీశ్‌రావ్‌లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సీరియస్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజున కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అయింది. మీడియా కాన్ఫరెన్సులో సైతం కల్వకుంట్ల ఫ్యామిలీపై ఘాటుగానే ఫైర్ అయ్యారు. ఆ కుటుంబంలో కోల్డ్ వార్ జరుగుతున్నదన్నారు. బావ, బామ్మర్దుల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కూడా నడుస్తున్నదన్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో సైతం కేటీఆర్, హరీశ్‌రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లాలని ఆ ఇద్దరూ ఉబలాట పడుతున్నారని అన్నారు. వారిని జైలుకు పంపాల్సిన కేసుల్లో రెండు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ఇంకా ముగియలేదన్నారు.

వారిద్దరికీ జైలు సెంటిమెంట్ ఆరాటం :

జైలుకు వెళ్ళి వచ్చినవారు సీఎంలు అవుతారనే సెంటిమెంట్‌ను కేటీఆర్, హరీశ్‌రావు నమ్ముకున్నారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్ జగన్, చంద్రబాబునాయుడు, తెలంగాణలో తాను జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాతే సీఎంలు అయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడు బావ, బామ్మర్దులు కూడా జైలుకు వెళ్లి వస్తే సీఎం అయిపోతామనే సెంటిమెంట్‌తో ఉన్నారని అన్నారు. ఆ ఇద్దరికీ సీఎం పదవిపై ఆశలున్నాయని, అందుకే ఎంత తొందరగా జైలుకు వెళ్తే అంత మంచి అవకాశం వస్తుందనుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగతంగా తనను దూషించడం ఎంచుకున్నారని అన్నారు. రాజకీయ కారణాలతో వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలన్న ఆలోచన తనకు లేదన్నారు.

ఆ ఇద్దరికంటే ముందే కవిత జైలుకెళ్లారు :

ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) పోటీ పడుతూ జైలు సెంటిమెంట్‌ను నమ్ముకుంటే ఆ ఇద్దరికంటే ముందే కవిత (Kavitha) జైలుకు వెళ్లివచ్చారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఆమె కూడా ఈ మధ్యనే కామెంట్ కూడా చేసినట్లుందన్నారు. ఏదో ఒక రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి కాకపోతానా అంటూ ఆమె కూడా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు అర్థమవుతున్నదన్నారు. కాళేశ్వరం విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చిన తర్వాత దాన్ని సీబీఐకి అప్పజెప్పామని గుర్తుచేసిన సీఎం రేవంత్ (Revanth Reddy).. ఇప్పటివరకు దాన్ని పట్టించుకోనేలేదని, దర్యాప్తు మొదలే పెట్టలేదన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు విషయంలోనూ ఈడీ ఎంటర్ అయిందని, ఇప్పుడు అది కూడా కేంద్రం పరిధిలోనే ఉన్నదన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కేంద్రం అనేక ఇబ్బందులు సృష్టించిందన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ విదేశాల్లో దాక్కుంటే తీసుకురావడానికి కేంద్రం తమకు సహకరించలేదని గుర్తుచేశారు.

Read Also: ఓం బిర్లా పై అవిశ్వాస బాంబు.. చరిత్ర ఏం చెబుతోంది?

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>