కలం, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో చిరుత పులి (Leopard Medak) సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఐబీ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారి 161పై చిరుత పులి ప్రత్యక్షమవడంతో వాహనదారులు ఉలిక్కిపడ్డారు. చీకటి సమయంలో రహదారిని దాటడానికి ప్రయత్నించిన చిరుత, ఎదురుగా వస్తున్న వాహనపు వెలుతురును గమనించి వెంటనే అప్రమత్తమై వెనక్కి వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న ఒక వాహనదారుడు తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీయడంతో అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కదలికలపై నిఘా ఉంచామని, ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


