Mobile Popup Ad
Mobile Popup Ad

కాంట్రాక్ట్స్ అనౌన్స్ చేసిన బీసీసీఐ.. రోహిత్, కోహ్లీలకు షాక్..

కలం, డెస్క్ : బీసీసీఐ (BCCI) 2025-2026 సీజన్‌కు ప్లేయర్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మ, కోహ్లీ డౌన్ గ్రేడ్‌లో ఉండటం అభిమానులకు భారీ షాక్‌ ఇచ్చింది. అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు ఈ కాంట్రాక్ట్స్ అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఈ జాబితాలో భారత పురుషుల జట్టుకు చెందిన 30 మంది, మహిళల జట్టుకు చెందిన 21 మంది ఆటగాళ్లకు చోటు లభించింది. ఒక్క వన్డేల్లో మాత్రమే ఆడుతున్న కారణంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు గ్రేడ్ ఏ+ నుంచి గ్రేడ్ బీకి డౌన్‌గ్రేడ్ అయ్యారు. ఇక టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు గ్రేడ్ ఏలో చోటు దక్కింది. మహిళల జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు గ్రేడ్ ఏలో నిలిచారు.

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2026లో జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ (BCCI) గ్రేడ్ బీలో ఉంచింది. అతనితో పాటు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లకు కూడా అదే గ్రేడ్‌లో స్థానం కల్పించింది. టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలకు గ్రేడ్ సీలో కాంట్రాక్ట్స్ ఇచ్చింది. మహిళల జట్టులో రేణుకా ఠాకూర్, షఫాలి వర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణాలు గ్రేడ్ బీలో కొనసాగుతుండగా, అమంజోత్ కౌర్, క్రాంతి గౌడ్, ఉమా చెత్రి, శ్రీ చరణితో పాటు యువ ఆటగాళ్లైన జీ కమలిని, వైష్ణవి శర్మలకు గ్రేడ్ సీ కాంట్రాక్ట్స్ దక్కాయి.

Read Also: సూర్యకుమార్ నాయకత్వంపై గంభీర్ ప్రశంసలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>