కలం, వెబ్ డెస్క్ : సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించారు. సూర్య కుమార్ వల్ల తన పని చాలా సులభమయిందని.. అతని నాయకత్వం జట్టుకు స్థిరత్వం తీసుకొచ్చిందని గంభీర్ పేర్కొన్నారు. అతని వ్యక్తిగత బ్యాటింగ్ ప్రతిభ కంటే, జట్టును నడిపించే విధానమే తనకు ముఖ్యంగా కనిపించిందని గంభీర్ తెలిపారు. ఆటగాళ్లతో సూర్యకుమార్ ఏర్పరుచుకున్న సంబంధం జట్టు వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లతో మాట్లాడే తీరు, వారితో సమయం గడపడం జట్టు ఐక్యతకు దోహదపడిందని చెప్పారు.
మైదానంలో సూర్యకుమార్ ప్రశాంతంగా ఉండటం వల్ల కోచ్‌గా తాను ఇతర అంశాలపై దృష్టి పెట్టగలిగానని గంభీర్ (Gautam Gambhir) వెల్లడించారు. నాయకుడిగా అవసరమైన ప్రతి అంశంలో సూర్యకుమార్ సరిపోతున్నాడని గంభీర్ స్పష్టం చేశారు. ఒత్తిడి పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడమే అతని బలమని పేర్కొన్నారు. సరైన మనసుతో జట్టును ముందుకు నడిపించే వ్యక్తి కెప్టెన్‌గా ఉండటం జట్టుకు కలిసొచ్చిందని చెప్పారు. ఇదిలా ఉండగా, భారత్ టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై 29 పరుగుల తేడాతో గెలుపొందింది. తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో ఆడనుంది.
Read Also: నేపాల్ క్రికెట్ టీమ్‌పై యువరాజ్ ప్రశంసల వెల్లువ
Follow Us On: Sharechat


