కలం డెస్క్ : మారేడుమిల్లి(Maredumilli) పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన మడావి హిడ్మాతో పాటు మరో ఐదుగురు చనిపోయారు. సంఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 ఆటోమేటిక్ రైఫిళ్లు, ఒక రివాల్వర్, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిడ్మా(Madvi Hidma)తో పాటు ఆయన భార్య మడగం రాజే (దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు), జిల్లా కమిటీ సభ్యుడు లక్మల్, పార్టీ ప్లాటూన్ కమిటీ సభ్యులు కమ్లు, మల్లా, హిడ్మా గార్డు దేవె చనిపోయారు. ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయిన విషయాన్ని చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు బలగాలు ధృవీకరించడంతో ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియా కాన్ఫరెన్సులో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా హిట్ లిస్టులో ఉన్న హిడ్మా(Madvi Hidma)ను అంతమొందించడంపై ఉన్న ప్రణాళికలు, తాజా ఆపరేషన్‌తో అది సక్సెస్ కావడంపై అధికారులను, పాల్గొన్న పోలీసులను అభినందించారు.
Read Also: పటియాలా హౌస్‌కు బాంబు బెదిరింపు.. ఢిల్లీలో మళ్లీ హైఅలర్ట్
Follow Us on : Pinterest

