epaper
Wednesday, February 18, 2026
epaper

ఐసీసీ, పీసీబీ భేటీ.. భారత్‌తో మ్యాచ్ గురించే!

కలం, వెబ్​డెస్క్​: టీ20 వరల్డ్ కప్‌లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్, పాక్ మ్యాచ్ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారింది (ICC – PCB). ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పాక్ డిసైడ్ అవ్వడమే ఇందుకు కారణం. ఈ విషయంలోనే ఐసీసీ వార్నింగ్‌లు ఇస్తున్నా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) మాత్రం వెక్కి తగ్గడం లేదు. దీంతో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నది ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఆదివారం ఐసీసీ, పీసీబీ అధికారులు భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా నేతృత్వంలోని బృందం లాహోర్‌కు చేరుకుని పీసీబీతో చర్చలు జరుపుతోంది (ICC – PCB). షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరిగేలా పాకిస్థాన్ వైఖరిని పునరాలోచించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తున్నట్టు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పీసీబీ సీఈవో సల్మాన్ నసీర్, సలహాదారు అమీర్ మీర్ కూడా పాల్గొన్నారు.

ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో పరిస్థితి క్లిష్టమైంది. ఇప్పటికే రాజకీయ ఉద్రిక్తతల కారణంగా టోర్నమెంట్‌పై ప్రభావం పడుతోంది. నెదర్లాండ్స్‌పై తొలి మ్యాచ్ గెలిచిన పాకిస్థాన్, ఈ మ్యాచ్ ఆడకపోతే రెండు కీలక పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ భేటీల ఫలితమే మ్యాచ్ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశముందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: టీ20 వరల్డ్ కప్ 2026 : టాప్ స్కోరర్లు వీరే

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>