epaper
Wednesday, February 18, 2026
epaper

జీవితం సాఫీగా సాగదు.. జెన్ జీకి రాహుల్ గాంధీ సూచనలు

కలం, డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) జెన్ జీ స్టూడెంట్లకు తన సందేశం ఇచ్చారు. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదని.. ఒడిదుడుకులను తట్టుకుని.. పట్టుదలతో ముందుకెళ్లాలని సూచించారు. జీవితంలో కొన్ని చోట్ల అడ్జస్ట్ మెంట్ తప్పదని చెప్పారు. యూఏఈకి చెందిన కొందరు ఎన్నారై స్టూడెంట్లతో (NRI Students) రాహుల్ గాంధీ ముచ్చటించారు. తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. అభద్రతా భావం, మానిసిక ఆందోళన ఇప్పటి జెన్ జీ విద్యార్థులు ఎక్కువగా ఎదుర్కుంటున్నారని.. వాటన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్లినప్పుడే విజయం సొంతం అవుతందని తెలిపారు రాహుల్ గాంధీ.

తీవ్రమైన కాంపిటీషన్, ఉద్యోగ సవాళ్లు, మానసిక ఆందోళనలు తమకు సవాల్ గా మారాయని కొందరు విద్యార్థులు తెలిపారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ.. ‘నేను మీకు చెప్పేది ఒక్కటే. ఆత్మవిశ్వాసం లేని చోట ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవు. మనస్ఫూర్తిగా పోరాడినప్పుడే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుని లక్ష్యం వైపు గురిపెట్టాలి. కొన్ని సార్లు అనుకున్నది సాధించలేనప్పుడు కుంగిపోవద్దు. ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు లేనిదాని గురించి బాధపడొద్దు’ అంటూ తెలిపారు.

Read Also: నోబెల్​ శాంతి బహుమతి గ్రహీతకు ఆరేళ్ల జైలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>