epaper
Wednesday, February 18, 2026
epaper

రూ.500కోట్ల మోసం.. రియల్​ ఎస్టేట్​ వ్యాపారి ధ్రువ్ దత్​ శర్మ అరెస్ట్​ ​

కలం, వెబ్​డెస్క్​: హైదరాబాద్​తో పాటు అనేక నగరాల్లో రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేసే ప్రముఖ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి, థర్టీసెకండ్​ ఎవెన్యూ (32nd Avenue) రియల్​ ఎస్టేట్​ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ధ్రువ్​ దత్​ శర్మను గుర్​గావ్​​ పోలీసులు అరెస్టు చేశారు. ఒక బిల్డింగ్​లోని ఒకే ఫ్లోర్​ను 25 మందికి అమ్మి తద్వారా రూ.500కోట్ల మోసానికి పాల్పడిన కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం ఆరు రోజుల రిమాండ్​ విధించింది.

వివరాలివీ.. 32 మైల్​స్టోన్​ బిల్డింగ్​లోని 3వేల గజాల ఫ్లోర్​ను రూ.2.5కోట్లకు అమ్ముతామంటూ 2021లో ట్రామ్​ వెంచర్స్​తో అప్పటి అప్రా మోటెల్స్​(ప్రస్తుతం 32 మైల్​స్టోన్​ విస్టాస్​ ప్రైవేట్​ లిమిటెడ్​) సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అదే ఏడాది మొత్తం సొమ్ము తీసుంది. అయితే, నాలుగేళ్లు గడిచినా ఫ్లోర్​కు సంబంధించిన పత్రాలు ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాది జనవరిలో థర్టీసెకండ్​ ఎవెన్యూ సంస్థ సీఈవో ధ్రువ్​ దత్​ శర్మపై పోలీసులకు ట్రామ్​ వెంచర్స్​ ఫిర్యాదు చేసింది.

దర్యాప్తులో పోలీసులకు షాకింగ్​ నిజాలు తెలిశాయి. ట్రామ్​ వెంచర్స్​కు అమ్మిన అదే ఫ్లోర్​ను 2022 నుంచి 2023 మధ్య కాలంలో వేర్వేరుగా 25మందికి ధ్రువ్​ దత్​ శర్మ (Dhruv Dutt Sharma) అమ్మినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రూ.500కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. అనంతరం అరెస్టు చేశారు.

ఫోర్బ్స్​ లిస్ట్​లోని యువ బిలియనీర్​..

గురుగావ్​లోని గోల్ఫ్​ కోర్స్​ రోడ్​ సెక్టార్​ 42లో అత్యంత ధనికులు నివసించే డీఎల్​ఎఫ్​ కమేలియాస్​కు చెందిన ధ్రువ్​ దత్​ శర్మ (34) అమెరికాలోని బోస్టన్​ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్​ చదివారు. 2014లో గెస్ట్​హౌసర్​ పేరుతో రెంటల్​ సంస్థను ప్రారంభించారు. 2015లో థర్టీసెకండ్​ ఎవెన్యూ సంస్థను (32nd Avenue) ప్రారంభించారు. 2018లో ‘ఫోర్బ్స్​ 30 అండర్​ 30–ఆసియా’ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యంత విలాసవంతమైన బిల్డింగ్​లు నిర్మించి, రియల్​ ఎస్టేట్​ రంగంలో టాప్​ బిజినెస్​మ్యాన్​గా ఎదిగారు. చివరికి మోసం కేసులో కటకటాల పాలయ్యారు.

Read Also: జీవితం సాఫీగా సాగదు.. జెన్ జీకి రాహుల్ గాంధీ సూచనలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>