కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌తో పాటు అనేక నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, థర్టీసెకండ్ ఎవెన్యూ (32nd Avenue) రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ధ్రువ్ దత్ శర్మను గుర్గావ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక బిల్డింగ్‌లోని ఒకే ఫ్లోర్‌ను 25 మందికి అమ్మి తద్వారా రూ.500కోట్ల మోసానికి పాల్పడిన కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం ఆరు రోజుల రిమాండ్ విధించింది.
వివరాలివీ.. 32 మైల్స్టోన్ బిల్డింగ్‌లోని 3వేల గజాల ఫ్లోర్‌ను రూ.2.5కోట్లకు అమ్ముతామంటూ 2021లో ట్రామ్ వెంచర్స్‌తో అప్పటి అప్రా మోటెల్స్(ప్రస్తుతం 32 మైల్స్టోన్ విస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్) సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అదే ఏడాది మొత్తం సొమ్ము తీసుంది. అయితే, నాలుగేళ్లు గడిచినా ఫ్లోర్‌కు సంబంధించిన పత్రాలు ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాది జనవరిలో థర్టీసెకండ్ ఎవెన్యూ సంస్థ సీఈవో ధ్రువ్ దత్ శర్మపై పోలీసులకు ట్రామ్ వెంచర్స్ ఫిర్యాదు చేసింది.
దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ట్రామ్ వెంచర్స్‌కు అమ్మిన అదే ఫ్లోర్‌ను 2022 నుంచి 2023 మధ్య కాలంలో వేర్వేరుగా 25మందికి ధ్రువ్ దత్ శర్మ (Dhruv Dutt Sharma) అమ్మినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రూ.500కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. అనంతరం అరెస్టు చేశారు.
ఫోర్బ్స్ లిస్ట్‌లోని యువ బిలియనీర్..
గురుగావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్ సెక్టార్ 42లో అత్యంత ధనికులు నివసించే డీఎల్ఎఫ్ కమేలియాస్కు చెందిన ధ్రువ్ దత్ శర్మ (34) అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదివారు. 2014లో గెస్ట్హౌసర్ పేరుతో రెంటల్ సంస్థను ప్రారంభించారు. 2015లో థర్టీసెకండ్ ఎవెన్యూ సంస్థను (32nd Avenue) ప్రారంభించారు. 2018లో ‘ఫోర్బ్స్ 30 అండర్ 30–ఆసియా’ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యంత విలాసవంతమైన బిల్డింగ్లు నిర్మించి, రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ బిజినెస్‌మ్యాన్‌గా ఎదిగారు. చివరికి మోసం కేసులో కటకటాల పాలయ్యారు.
Read Also: జీవితం సాఫీగా సాగదు.. జెన్ జీకి రాహుల్ గాంధీ సూచనలు
Follow Us On: X(Twitter)


