epaper
Wednesday, February 18, 2026
epaper

హామీల‌పై ప్ర‌శ్నిస్తే రేవంత్ బూతులు తిడుతుండు: కేటీఆర్

క‌లం, వెబ్ డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌పై ప్ర‌శ్నిస్తే బూతులు తిడుతున్నాడ‌ని కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. మున్సిప‌ల్‌ ఎన్నిక‌ల (Municipal Elections) ప్ర‌చారంలో భాగంగా తాండూర్‌ (Tandur)లో నిర్వ‌హించిన స‌భ‌లో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎవ‌రైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నార‌ని కేటీఆర్ ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌ని, కేసుల‌కు భయపడేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. రేవంత్ రెడ్డి అర‌చేతిలో వైకుంఠం చూపించి అభ‌య హ‌స్తం అన్నాడ‌ని.. కానీ అది భ‌స్మాసుర హ‌స్తం అని విమ‌ర్శించారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నాయ‌కుల మాట‌లు న‌మ్మి వారిని గెలిపించార‌ని, నేడు రైతులు, మ‌హిళ‌లు, యువ‌త అంతా న‌ష్ట‌పోతున్నార‌ని కేటీఆర్ (KTR) అన్నారు. ప్ర‌జ‌లు ఓడించినా కేసీఆర్‌, రోహిత్ రెడ్డికి ఏమీ కాలేద‌ని, ఇప్పుడు రైతులు గోస ప‌డుతున్నార‌ని తెలిపారు. రైతుల‌కు క‌నీసం యూరియా కూడా దొర‌క‌డం లేద‌ని చెప్పారు. రెండేళ్ల కింద ప్ర‌జ‌ల‌కు మోసం జ‌రిగింద‌ని, మ‌ళ్లీ మోస‌పోవ‌ద్ద‌ని ప్ర‌జ‌లకు సూచించారు. తులం బంగారం, మ‌హిళ‌ల‌కు రూ.2500, ఆడ పిల్ల‌ల‌కు స్కూటీలు, బ‌తుక‌మ్మ చీర‌లు, క్రిస్మ‌స్, రంజాన్ తోఫాలు ఏవీ రాలేద‌న్నారు. కేసీఆర్ ఉన్న‌ప్పుడు అంద‌రికీ అన్నీ వ‌చ్చాయ‌న్నారు. తాండూర్‌లో ఉన్న 35 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరారు. రెండేళ్ల‌లో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంద‌ని, ఆ త‌ర్వాత మూడేళ్లు మున్సిపాటిలీ కేసీఆర్ హ‌యాంలోనే ఉంటుంద‌ని తెలిపారు.

Read Also: మంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>