epaper
Wednesday, February 18, 2026
epaper

వారణాసి క్రేజీ అప్డేట్.. రాజమౌళి, మహేశ్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్, ఇండస్ట్రీ చరిత్రలోనే!

కలం, వెబ్ డెస్క్: దర్శక ధీరుడు ఎస్‌.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi). భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో సుమారు రూ. 1300 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, పౌరాణిక అంశాలు మిళితమై ఉంటాయని సమాచారం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి (Rajamouli) పారితోషికం విషయంలో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మూవీ కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో రాజమౌళికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ హక్కుల విలువ దాదాపు రూ. 160 కోట్లకు పైనే ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. మరోవైపు మహేశ్ బాబు (Mahesh Babu) కూడా ఈ సినిమాలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారని, సినిమా లాభాల్లో వాటా ద్వారా ఆయనకు రూ. 150 కోట్లనుంచి రూ. 200 కోట్ల వరకు ఆదాయం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. ఆమెకు భారీగా రూ. 30 నుంచి 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో శక్తిమంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>