కలం, నల్లగొండ: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ 2026–27 (Telangana ICET) నోటిఫికేషన్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ టీజీ ఐసెట్ 2026 నోటిఫికేషన్ ఎంజియూ వీసీ,సెట్ చైర్మన్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో టీజీ ఐసెట్ కో కన్వీనర్ డాక్టర్ మిర్యాల రమేష్, జక్క సురేష్ రెడ్డి, ఆచార్య సరిత, ఆచార్య శ్రీలక్ష్మి, సబీనా హెరాల్డ్, అనురాధ, లక్ష్మీ ప్రభ, ప్రవళిక, మారం వెంకటరమణారెడ్డి, శ్వేత, జ్యోతి, స్వప్న, రమేష్ నాయక్ పాల్గొన్నారు.
ఈ నెల 12 నుంచి మార్చి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జనరల్ అభ్యర్థులు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 ఫీ చెల్లించాలి. ఈ గడువు దాటితే ఆలస్య రుసుము వసూలు చేస్తారు. పరీక్షలు మే 13, 14న నిర్వహిస్తారు. మొదటి రోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటలకు వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే రెండో రోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30వకు మూడో సెషన్ పరీక్ష ఉంటుంది. అదే నెల 29న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలను మే 30 నుంచి జూన్ 5 వరకు స్వీకరిస్తారు. తుది కీ, ఫలితాలను జూన్ 19న రిలీజ్ చేస్తారు.
Read Also: ఏడాదికే కోటీశ్వరుడైన బాలుడు.. ఈ చిన్నారి బర్త్డే గిఫ్ట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Follow Us On: Sharechat


