యాదాద్రి జిల్లాలో పేకాట రాయుళ్ల అరెస్ట్

కలం, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురిని శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2,07,000 రూపాయల నగదు మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తుర్కపల్లి ఎస్ఐ తఖియుద్దీన్ మాట్లాడుతూ కాశిరేడ్డిపల్లీ కి చెందిన మల్లేష్.. లక్ష్మణ్ అనే వ్యక్తి సహాయంతో వాసాలమర్రి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో మరికొంత మంది పేకాట రాయుళ్ళ తో పేకాట ఆర్గనైజ్ చేస్తున్నాడని తెలిపారు. ఎవరైనా పేకాట ఆడినా, ఆర్గనైజ్ చేసినా, చట్ట వ్యతిరేక చర్యలకి పాల్పడినా, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Read Also: వేయిస్తంభాల ఆలయ కమిటీపై కొండా సురేఖ ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>