Mobile Popup Ad
Mobile Popup Ad

కానిస్టేబుల్ కుటుంబాల‌కు ఎక్స్ గ్రేషియా

కలం, వెబ్​ డెస్క్​ : ఇటీవ‌ల విధి నిర్వ‌హ‌ణ‌లో మ‌ర‌ణించిన తెలంగాణ ఎక్సైజ్‌ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రూ.కోటి సాయం అంద‌జేసింది. దీంతోపాటు, గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌రులో డ్యూటీ చేస్తుండగా దుండ‌గుల చేతిలో క‌త్తి పోటుకి గురై మృత్య‌వాత ప‌డిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్-గ్రేషియా ఇచ్చారు. ఈ సహాయానికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిజామాబాద్‌లో ఆ కుటుంబాలకు స్వ‌యంగా అంద‌జేశారు.

నిజామాబాద్‌లో జనవరి 23న అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సౌమ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ నిమ్స్‌లో సౌమ్య చికిత్స పొందుతూ మృతిచెందిన విష‌యం విదితమే.

Read Also: హామీలు వెంటనే అమలు చేయాలి : గొంగిడి సునీతా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>