కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ప్రస్తుతం సాగుతున్న జంగిల్ రాజ్ పాలన చూసి నాగరిక సమాజం తలదించుకుంటోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) విమర్శించారు. శుక్రవారం మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) నివాసానికి వెళ్లిన ఆయన, రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు చెబుతున్న అబద్ధాలను ప్రశ్నిస్తే వైసీపీ నేతల (YCP Leaders) ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. గుంటూరులో టీడీపీ గూండాలు స్వైరవిహారం చేశారని, పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి ఐదు కార్లను ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి మహిళలను దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే తరహాలో జోగి రమేశ్ ఇంటిపై కూడా దాడులకు తెగబడ్డారని ఆయన వివరించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రచారం అన్యాయమని, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని జగన్ మండిపడ్డారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నివేదిక తేల్చిందన్నారు. దీని ద్వారా చంద్రబాబు రోజూ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని నిరూపితమైందని ఆయన తెలిపారు. గత టీడీపీ హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు వాడారని జగన్ (YS Jagan) పేర్కొన్నారు.
Read Also: పవన్ సార్.. మా గ్రామానికి రోడ్డు వేయించండి: చిన్నారుల రిక్వెస్ట్
Follow Us On : WhatsApp


