epaper
Wednesday, February 18, 2026
epaper

అహంకారులకు కార్పొరేషన్ ఎన్నికలు గుణపాఠం కావాలి: ఎమ్మెల్యే కూనంనేని

కలం/ఖమ్మం బ్యూరో: ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో అహంకారులకు గట్టి గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని (Kunamneni)  సాంబశివరావు పిలుపునిచ్చారు. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా, నిబద్ధత గల సీపీఐ (CPI) అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శుక్రవారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49, 10, 58. 59. 60 డివిజన్లలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కొత్తగూడెం (Kothagudem) అభివృద్ధిలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర చిరస్మరణీయమని, బడుగు బలహీన వర్గాల గొంతుకగా సీపీఐ ఎల్లప్పుడూ నిలబడుతుందని స్పష్టం చేశారు.

బస్తీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల నుంచి సంక్షేమ ఫలాల పంపినీవరకు వరకు ప్రతి అంశంపై తాము పోరాడుతామని కూనంనేని (Kunamneni) హామీ ఇచ్చారు. కార్పొరేషన్ పాలనలో పారదర్శకత ఉండాలంటే ఎర్రజెండా అభ్యర్థుల విజయం అనివార్యమని పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేశానని, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలబెట్టేందుకు ప్రభుత్వంతో పోరాడి నిధులు మంజూరు చేయిస్తున్నానన్నారు. అభివృద్ధి అంటే కేవలం కాంట్రాక్టులు కాదని, సామాన్యుడి ముంగిటకు సంక్షేమ ఫలాలు చేరడమే అభివృద్ధి అన్నారు. కార్పొరేషన్ సమగ్రంగా అభివృద్ధి సాధించడమే నిజమైన విజయమని ఆయన ఉద్ఘాటించారు.

Read Also : మేడారం హుండీలో ప్రేమలేఖలు..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>