కలం మెదక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నేతలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పరిష్కారంకాని సమస్యలపై స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు కేటీఆర్‌ను సిరిసిల్ల ప్రజలు నిలదీయగా, ఇవాళ (శుక్రవారం) మరో నేతపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ (Gajwel Municipality) ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలను మల్లన్నసాగర్ ముంపు బాధితులు అడ్డుకున్నారు.
గజ్వేల్ మున్సిపల్ (Gajwel Municipality) పరిధిలోని 11 వార్డు బంజేరుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారానికి వెళ్లిన గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డిని చుట్టుముట్టారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌తో (Mallanna Sagar) ఊర్లు, భూములు లేకుండా చేసి తమను నిండా ముంచారని ఆరోపించారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చారంటూ నిలదీశారు. తమ ఉసురుతగిలే బీఆర్ఎస్ (BRS) ఓడిపోయిందని శాపనాన్థాలు పెట్టారు.
Read Also: 2029లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp


