కలం, వెబ్ డెస్క్ : సత్యసాయి జిల్లా హిందూపురం (Hindupuram) నియోజకవర్గంలో కాల్పుల కలకలం సృష్టించాయి. హిందూపురంకి చెందిన సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిపై రౌడీ షీటర్ నాగేంద్ర కత్తితో దాడి చేశారు. అనంతరం పారిపోతున్న అతనిపై చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో పోలీసులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో రౌడీకి గాయాలు కాగా, అతడితో పాటు సీఐ, కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలించారు. నాగేంద్రపై ఏపీ, కర్నాటకలో 90కి పైగా కేసులు ఉన్నాయి. గతంలో హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగిన కేసులో రౌడీ షీటర్ నాగేంద్ర నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులోనే అతడిని పట్టుకునేందుకు వెళ్లగా దాడికి పాల్పడ్డాడు.
Read Also: పవన్ సార్.. మా గ్రామానికి రోడ్డు వేయించండి: చిన్నారుల రిక్వెస్ట్
Follow Us On: Instagram


