జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి ఖరారు అయిన నిమిషాల్లోనే కల్వకుంట్ల కవిత(Kavitha) ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు? కేటీఆర్‌నా? హరీష్‌నా? లేక మొత్తం బీఆర్ఎస్ పార్టీనా? అన్న చర్చ తీవ్రంగా జరిగింది. తాజాగా నవంబర్ 14న తాను చేసిన ‘కర్మ హిట్స్ బ్యాక్’ ఎవరికి అన్న దానిపై కవిత క్లారిటీ ఇచ్చారు. జనం జాగృతి బాటలో భాగంగానే ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే “కర్మ హిట్స్ బ్యాక్’’ ట్వీట్ ఎవరిని లక్ష్యంగా చేసిందని మీడియా ప్రశ్నించింది.
ఆ ప్రశ్నకు కవిత(Kavitha) కేవలం “జై తెలంగాణ’’ అంటూ సమాధానమిచ్చారు. జాగృతి కార్యక్రమాల్లో ప్రజలు చేసిన ఆరోపణల ఆధారంగా తాను వ్యాఖ్యానించానని చెప్పారు. ‘‘నేను ఏసీ గదిలో కూర్చొని మాట్లాడేదానిని కాను, ప్రజల మాటలనే చెబుతున్నాను’’ అని చెప్పారు. తన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ స్పందించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మాజీ మంత్రులైన హరీశ్‌రావు, గంగుల కమలాకర్ కూడా ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఇతర నాయకులు కూడా స్పందించే ధైర్యం చూపాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తన పాత్ర ఏమీ లేదని, తాను కేవలం ప్రేక్షకురాలిగా మాత్రమే ఉన్నానని కవిత స్పష్టం చేశారు.
Read Also: అసెంబ్లీ స్పీకర్‌పై కేటీఆర్ పిటిషన్..
Follow Us on : ShareChat

