epaper
Wednesday, February 18, 2026
epaper

ఇండ్లు కోల్పోతున్న వారిని ఆదుకుంటాం : కలెక్టర్​ స్నేహ శబరీష్

కలం, వరంగల్ బ్యూరో : భద్రకాళీ మాఢవీధుల నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ (Sneha Sabarish) అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో భద్రకాళి మాడవీధుల నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న కుటుంబాలతో డబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కుడా, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఇండ్లు కోల్పోతున్న వారు తమ అభిప్రాయాలను కలెక్టర్ కు తెలియజేశారు. ఇండ్లు కోల్పోతున్న తమకు మరోకచోట ఇండ్లు ఇవ్వాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రస్తుతం భద్రకాళి మాఢవీధుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, సహకరిస్తున్నందుకు కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం తరపున ప్రయోజనాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో హనుమకొండ (Hanumakonda) ఆర్డీవో రాథోడ్ రమేష్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, హనుమకొండ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి సిద్ధార్థ నాయక్, మైనింగ్ ఏడి రవిశంకర్, జిడబ్ల్యూఎంసి కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, జీడబ్ల్యుఎంసీ సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, ఇతర అధికారులతో పాటు మాజీ కార్పొరేటర్ బోడ డిన్న, ఇండ్ల నివాసులు పాల్గొన్నారు.

Read Also: బూతులపై ఉన్న శ్రద్ధ, ప్రజల బతుకులపై లేదు.. రేవంత్​పై హరీశ్ రావు ఫైర్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>