కలం, మెదక్ బ్యూరో : రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 700 రోజులు దాటినా ఏ ఒక్క గ్యారంటీ అమలు కాలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు అమలు చేయమని అడిగితే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. సీఎంగా మాట్లాడే భాషేనా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ మహిళలకు ఒక్కొక్కరికి రూ. 60వేలు బాకీ పడిందని ఆయన వివరించారు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy) అక్రమంగా సంపాదించిన డబ్బులను పంచాలని చూస్తున్నాడని.. ఇచ్చే పైసలను తీసుకుని.. ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని హరీశ్ రావు కోరారు. కేసీఆర్ (KCR) ఇచ్చినవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ పెట్టిందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి (Kalyana Lakshmi) కింద రూ. లక్ష 116 ఇస్తే.. రేవంత్ రెడ్డి తులం బంగారం కూడా ఇస్తానని ఆశపెట్టి ఉన్న లక్ష రూపాయలు కూడా ఇవ్వకుండా రెండేళ్లుగా చెక్కుల కోసం ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నాడని విమర్శించారు. బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడమే తప్ప పేదల కోసం పని చేయదని.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణకు మొండిచేయి చూపించి.. గుజరాత్ కు, ఏపీకి నిధులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారరు. రాష్ట్రానికి రూపాయి ఇవ్వని ఆపార్టీకి ఎందుకు ఓటు వేయాలని హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు.
Read Also: నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ ప్రభంజనం.. వ్యూస్‌లో వరల్డ్ రికార్డ్
Follow Us On : WhatsApp


