epaper
Wednesday, February 18, 2026
epaper

టెకీలకు గుడ్​ న్యూస్​.. ‘బూమరాంగ్​ ఎంప్లాయీ​’ షురూ!

కలం, వెబ్​డెస్క్​: కార్పొరేట్​ ప్రపంచంలో ‘లేఆఫ్స్’ ఒక్కరోజులోనే ఎన్నో ఉద్యోగాలకు ఎసరు పెడుతుంది (Boomerang Employee). కంపెనీ​ పింక్​ స్లిప్​ ఇచ్చి, లేదా మెయిల్​ చేసి ‘వుయ్​ విల్​ స్టే ఇన్​ టచ్​’ అన్నారంటే ఉద్యోగికి ‘గుడ్​బై’ చెప్పినట్లే. ఆ ఉద్యోగం ఊడినట్లే. అక్కడితో ఉద్యోగికి కంపెనీ డోర్లు క్లోజ్​ అవుతాయి. బ్యాడ్జ్​లు పనిచేయవు. స్లాక్​ యాక్సెస్​ మాయమవుతుంది. అంతేకాదు, ఒక్కసారి ఉద్యోగి కంపెనీ నుంచి వెళ్లిపోయారంటే.. ఇక వెళ్లిపోయినట్లే.

గత రెండేళ్లుగా సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు​ ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యే ఇది.. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం ముఖ్యంగా ఏఐ రాకతో వచ్చిన విపత్తు ఇది.. వీటి వల్ల ఇప్పటికే ఎంతో మంది జాబ్స్​ పోగొట్టుకొని ఖాళీగా ఉంటున్నారు. మరికొందరు ఎప్పుడు ఉద్యోగాలు ఊడతాయో తెలీక బిక్కుబిక్కుమంటున్నారు. కొత్త ఉద్యోగాల సంగతి సరేసరి. లక్షల సంఖ్యలో ప్రెషర్లు కంపెనీల ఆఫర్ల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి సమయంలో టెకీల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది ‘బూమరాంగ్​ ఎంప్లాయీ’ ట్రెండ్​ (Boomerang Employee). సాఫ్ట్​వేర్​ సంక్షోభ సమయాల్లో ఒకప్పుడు ఆపద్బాంధవునిలా ఆదుకున్న ఈ ట్రెండ్​ ఇప్పుడు మళ్లీ వచ్చింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపీందర్​​ గోయల్ (Deepinder Goyal)​ మంగళవారం దీనికి నాంది పలికారు. వివిధ కారణాలతో జొమాటో, అనుబంధ కంపెనీల నుంచి వెళ్లిపోయిన లేదా కంపెనీ వెళ్లిపొమ్మని చెప్పినవాళ్లు తిరిగి చేరవచ్చంటూ ఆహ్వానం పలికారు. ఈ మేరకు ‘ఎక్స్​’లో సుదీర్ఘ ట్వీట్​ చేశారు.

‘జొమాటో (Zomato) లో గతంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ లేఖ. మీరు స్వచ్ఛందంగా సంస్థను విడిచిపెట్టి వెళ్లినా, లేదా కంపెనీ నిర్ణయంతో వెళ్లిపోయినా.. ఈ మెసేజ్​ మీకోసమే. సంస్థలో పని వాతావరణమో, లేక నాయకత్వమో నచ్చక మీరు వెళ్లిపోయి ఉండవచ్చు. లేదా కంపెనీనే మిమ్మల్ని వెళ్లమని చెప్పి ఉండవచ్చు. అయితే, మీకోసం కంపెనీ తలుపులు మాత్రం శాశ్వతంగా మూత పడలేదు. మీరు మళ్లీ చేరాలనుంటే చేరొచ్చు. ఇప్పటికే దాదాపు 400 మంది ఇలా తిరిగొచ్చారు. వాళ్లంతా అత్యుత్తమ పనితీరు చూపిస్తున్నారు. ఇది వాళ్లకే కాదు, కంపెనీ అభివృద్ధికీ ఉపయోగపడుతోంది. జొమాటో ఇప్పుడు బ్లింకిట్​ క్విక్​ కామర్స్​, బ్లింకిట్​ అంబులెన్సులు, డిస్ట్రిక్ట్​, హైపర్​ప్యూర్​, నగెట్​, ఫీడింగ్​ ఇండియాలతో అతిపెద్ద సంస్థగా మారింది. ఇక్కడ మీ అవసరం ఉందనుకునేవాళ్లు, ఇందులో చేరాలనుకుంటే back@eternal ఐడీకి మెయిల్​ చేయండి’ అని ఆ ట్వీట్​లో పేర్కొన్నారు దీపీందర్​ గోయల్.

బూమరాంగ్​ అంటే?

బూమరాంగ్​ అంటే ఆస్ట్రేలియాలోని గిరిజన జాతులు వాడే ఒక ఆయుధం. దీన్ని చెక్కతో తయారుచేస్తారు. రెండు చివరలా పట్టుకొనేందుకు పిడి ఉండి, మధ్యలో కత్తిలా పదునుగా ఉండే ఈ ఆయుధాన్ని జంతువులు, లేదా శత్రువులపైకి వదిలితే అది లక్ష్యాన్ని చేరుకొని, పని పూర్తి చేసి తిరిగి ప్రయోగించిన వాళ్ల దగ్గరికి వస్తుంది. ఈ ఆయుధానికే ‘బూమరాంగ్’​ అని పేరు.

ఎప్పటి నుంచో ఉంది..

ఎవరైనా ఉద్యోగి కంపెనీ నుంచి వెళ్లిపోయి, కొంతకాలం మళ్లీ అదే కంపెనీలో చేరడాన్ని ‘బూమరాంగ్​ ఎంప్లాయీ’ అంటారు. గతంలో కంపెనీలు చాలా అరుదుగా ఈ పద్ధతిని ఫాలో అయిన సందర్బాలు ఉన్నాయి. 2010లో కొన్ని కంపెనీలు ఈ ట్రెండ్​ పాటించాయి. ఆ తర్వాత కొవిడ్​ సమయంలో గ్రేట్​ రిజిగ్నేషన్​ పీరియడ్​ పూర్తయ్యాక, తిరిగి చాలా మంది ఉద్యోగులను ఇదే పద్ధతిలో కంపెనీలు తిరిగి చేర్చుకున్నాయి. ప్రస్తుతం కంపెనీ నియామకాల్లో ప్రతి పదింటిలో ఒకటి ‘బూమరాంగ్​’ పద్ధతిలో జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే, కొన్ని కంపెనీలు భారీ స్థాయిలో ఈ ట్రెండ్​ను వాడుతున్నాయి. ఒక్క జొమాటోనే కాదు, ఐబీఎం, లెనోవా, కోకాకోలా ఇలాగే తమ పాత ఉద్యోగులకు రీఆఫర్స్​ ఇస్తున్నాయి. ఇటీవలే పేటీఎం, మేక్​మైట్రిప్​, ఇన్​మొబి ‘బూమరాంగ్​’ పద్ధతిని పాటించినట్లు చెబుతున్నారు. మెటా సైతం ఒకప్పుడు తాను కాదనుకున్న ఒక ఉద్యోగిని తిరిగి కంపెనీలో చేర్చుకున్న విషయం తెలిసిందే.

ఎందుకు వాళ్లే మళ్లీ?
  • పాత ఉద్యోగులకు కంపెనీ కల్చర్​ తెలిసి ఉండడం.
  • టీమ్​లతో త్వరగా కలసిపోగలగడం.
  • శిక్షణ అవసరం లేకపోవడం. ఒకవేళ ఉన్నా తక్కువ సమయం పట్టడం.
  • వేరో చోట చేరిన పాత ఉద్యోగులు, అక్కడ కొత్త స్కిల్స్​ నేర్చుకొని ఉండడం.
  • నియామకానికి మనీ, టైమ్​ సేవ్​ కావడం.

ఏదేమైనా జొమాటో ద్వారా ‘బూమరాంగ్​ ఎంప్లాయీ’ ట్రెండ్​ మళ్లీ షురూ కావడం టెక్​ ఉద్యోగుల్లో కొత్త ఆశలు కలిగిస్తోంది. దీనిని జొమాటోనే కాకుండా అన్ని కంపెనీలు అనుసరించాలని వాళ్లు బలంగా కోరుకుంటున్నారు.

ఈ కొత్త ట్రెండ్​తో ఏం తెలుస్తోందంటే.. ఒక్కోసారి కొత్త ప్రారంభం బాగా తెలిసినచోట నుంచే మొదలవుతుంది. అది ఉద్యోగికైనా, కంపెనీకైనా.

Read Also: మేళ్లచెర్వు శివాలయానికి రూ.కోటి మంజూరు చేసిన ప్రభుత్వం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>