కలం డెస్క్ : ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో తనకు ఎలాంటి భూమీ లేదని ఎమ్మెల్సీ నవీన్ కుమార్(MLC Naveen Kumar) స్పష్టత ఇచ్చారు. అక్కడ 18 ఎకరాల భూములున్నట్లు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. రీజినల్ రింగ్ రోడ్ పక్కన 18 ఎకరాల భూమి ఉందంటూ అక్కడి రైతులు చెప్పినట్లుగా కవిత చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. ట్రిపుల్ రోడ్డు అలైన్‌మెంట్‌ను తన భూముల కోసమే కోసం మార్చినట్లు ఆమె చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని అన్నారు. ఆ గ్రామంలోగానీ, ఆ మండలంలోగానీ, మొత్తానికి ఆ ప్రాంతంలోనే తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి భూమి లేదని ఎమ్మెల్సీ నవీన్ క్లారిటీ ఇచ్చారు.
ఉద్దేశపూర్వకంగానే ప్రజల్లో అపోహలు సృష్టించి గందరగోళానికి గురిచేయడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని, అబద్ధాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఆమెకు తగదని, బాధ్యతాయుతమైన రాజకీయ నాయకత్వానికి ఇలాంటి చర్యలు విరుద్ధమైనవన్నారు. ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్ఠకు నష్టం కలిగించే తప్పుడు వ్యాఖ్యలపై, చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని MLC Naveen Kumar హెచ్చరించారు.
Read Also: హరీష్ రావు పై మరో భారీ బాంబు పేల్చిన కవిత
Follow Us on : Reddit

