జూబ్లీలో హిల్స్(Jubilee Hills) ఉపఎన్నికలో గెలిచిన 24 గంటల్లోనే కాంగ్రెస్ తన అసలు రంగు చూపించుకుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. గెలిచేశాం మనకేంటి అన్న భావించి తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రహమత్‌నగర్‌లో తమ పార్టీ కార్యకర్త రాకేశ్‌పై జరిగిన దాడిన ఆయన తీవ్రంగా ఖండించారు. రాకేశ్‌ను శనివారం ఉదయం కేటీఆర్ పరామర్శించారు. ఫలితాలు వచ్చి 24 గంటలు దాటక ముందే కాంగ్రెస్ గూండాయిజం చేస్తోందని విమర్శించారు. తాము కూడా అనేక ఎన్నికల్లో గెలిచామని.. కానీ ఇలా దాడులు చేయలేదన్నారు.
‘‘మేము పదేళ్లు అధికారంలో ఉన్నాం, చాలా ఉప ఎన్నికల్లో గెలిచాము, ఎప్పుడు కాంగ్రెస్ లాగా మేము దాడులు చేయలేదు. కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాము’’ అని చెప్పారు. తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలని కోరారు. దొంగ ఓట్లు, గూండా గిరి చేసి, డబ్బులు పంచి కాంగ్రెస్ గెలిచిందని KTR ఆరోపించారు.
Read Also: అన్నకి సలహా ఇచ్చిన కవిత
Follow Us on : Pinterest

