epaper
Wednesday, February 18, 2026
epaper

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhneva) మంగళవారం దర్శించుకున్నారు. పవన్ కల్యాణ్‌ సతీమణికి ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న స్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నా లెజినోవా (Anna Lezhneva). పూజ తర్వాత ఆలయ స్నపన మండపంలో ముఖ్య అర్చకులు చెప్పెల వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్ కుమార్ శర్మలు ఆశీర్వచనం అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>