epaper
Wednesday, February 18, 2026
epaper

టారిఫ్​ ​కట్​ ఎఫెక్ట్​.. పెట్రోల్​​ రేట్లు పెరుగుతాయా?

కలం, వెబ్​డెస్క్​: భారత్​పై విధించిన టారిఫ్స్​ను అమెరికా తగ్గించింది (US Tariff Cut). 25శాతం నుంచి 18శాతానికి మార్చింది. ఈ క్రమంలో సుంకాల తగ్గింపు వల్ల మనకు లాభం కలుగుతుందని అధికార పార్టీతోపాటు, వాణిజ్య వర్గాలు, పరిశ్రమల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఈ డీల్​ కుదరడం వెనక అమెరికా కొన్ని కండిషన్లు పెట్టిందని, అందులో రష్యా నుంచి ఆయిల్​ కొనడం ఆపేయాలనే షరతు ఒకటని వినిపిస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

ఒకవేళ అమెరికా కండిషన్స్​కు ఒప్పుకొని, రష్యా (Russia) నుంచి మన దేశం ఆయిల్​ కొనడం పూర్తిగా మానేసి.. అమెరికా నుంచి కొంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రష్యా మనకు డిస్కౌంట్లు పోనూ.. ఒక్కో బ్యారెల్ ఆయిల్​ను 40 డాలర్లకు సరఫరా చేస్తున్నది. అదే.. అమెరికా మాత్రం 50 నుంచి 60 డాలర్లకు పంపుతున్నది.

రష్యా నుంచి వచ్చే ఆయిల్​లో రవాణా, బీమా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్​కు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. భవిష్యత్తులో అమెరికాతో తక్కువ ధరకే కొనేలా ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నాయని.. ప్రస్తుతానికి పెట్రోల్​, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని మార్కెట్​ వర్గాలు అంటున్నాయి.

రూపాయి బలపడేనా!

ఇన్నాళ్లూ ట్రంప్ (Donald Trump)​ టారిఫ్​ల ఎఫెక్ట్​, అంతర్జాతీయ పరిణామాల వల్ల అమెరికా డాలర్​తో పోలిస్తే భారతీయ కరెన్సీ విలువ భారీగా పతనమవుతూ వచ్చింది. ఈ ఏడాది జనవరి 30న ఏకంగా 92 మార్క్​ను దాటిపోయి.. అత్యంత కనిష్ఠానికి చేరింది. 2014లో 60 మార్క్​ దగ్గర బలంగా ఉన్న రూపాయి విలువ.. ట్రంప్​ రెండోసారి ప్రెసిడెంట్​గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారీగా పతనమవుతూ వచ్చింది.

ప్రస్తుతం టారిఫ్​లను తగ్గించడంతో (US Tariff Cut) రూపాయి కోలుకుంటున్నది. ఫిబ్రవరి 2న 91.27 వద్ద ఉండగా.. అది మంగళవారం 1.5శాతం తగ్గి 90 మార్క్​ దగ్గర కొనసాగుతున్నది. రూపాయి బలపడితే భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం. అమెరికాతోనే కాకుండా ఇతర దేశాలతో జరిగిన ఫ్రీ ట్రేడ్​ డీల్స్​ వంటివి కలుపుకొంటే రూపాయి 90 మార్క్​ కిందికి దిగివచ్చే అవకాశాలూ లేకపోలేదని ఎక్స్​పర్ట్స్​ అంచనా వేస్తున్నారు.

Read Also: జీరో టారిఫ్​.. ఐఫోన్​​, హార్లే డేవిడ్సన్​పై ఆదా!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>