epaper
Wednesday, February 18, 2026
epaper

హార్వర్డ్​ కాదు.. అంతరిక్షం వెళ్లినా రేవంత్ బుద్ధి మారదు : మధుసూదనాచారి

కలం, వెబ్​ డెస్క్​ : కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి (Madhusudhana Chari) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ప్రెస్​ మీట్ లో ఆయన మాట్లాడారు. హార్వర్డ్​ వెళ్లినా.. అంతరిక్షం వెళ్లినా సీఎం రేవంత్ బుద్ధి మారదు అని విమర్శించారు. సీఎం వ్యాఖ్యలు సిట్ (SIT) విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు. మున్సిపల్​ ఎన్నికలు ఉన్నందునా విచారణకు కేసీఆర్​ టైమ్​ కోరారని, అంతేతప్ప విచారణకు రాలేనని చెప్పలేదన్నారు. ‘రెండేళ్లలో ఎన్నో విచారణలు ఎదుర్కొన్నాం.. దేనికి భయపడం.. కేసీఆర్​ ముమ్మాటికీ జాతిపితే‘ అని తేల్చి చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ (KCR)​ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారన్నారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్​ రెడ్డి ప్రమేయం లేదని.. తన చిల్లర బుద్ధిని చాటుకుంటూ కేసీఆర్‌పై అదే పనిగా పిచ్చి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో కాంగ్రెస్​ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. కేసీఆర్​ హయాంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరిగిందని తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వానికి మాటలు తప్ప, చేతలు లేవన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని మధుసూదనాచారి (Madhusudhana Chari) డిమాండ్​ చేశారు.

Read Also: KCR ఎంక్వయిరీ టైమ్‌లో సంతోష్ లేడెందుకు? బీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>