కేసీఆర్‌ను జాతిపిత అంటే ప్రజలు ఒప్పుకోరు: కోమటిరెడ్డి

కలం, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR)ను ఆ పార్టీ నేతలు తెలంగాణ జాతిపితగా అభివర్ణించడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ త్యాగం, సేవలు తెలంగాణ జాతిపిత ట్యాగ్‌లైన్‌కు సరిపోవన్నారు. కేసీఆర్ కంటే ముందుగా ఎంతోమంది నేతలు పోరాటాల్లో పాల్గొన్నారని, కేసీఆర్‌ను జాతిపితగా పోల్చడం సరైంది కాదన్నారు.

తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy)  సైతం స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకూ ఓ చరిత్ర ఉందని, ప్రత్యేక రాష్ట్రం కోసం సొంత పార్టీ నేతలనే ఎదురించి, మంత్రి పదవిని కూడా త్యాగం చేశానని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ సాధన ఒక్కరి పోరాటం వల్ల కాదని, 1100 మందికి పైగా ఆత్మబలిదానాలు, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఒక్కరిద్దరు నేతల మధ్య జరిగిన రాజకీయ పోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పడం చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు. కేసీఆర్‌ను ‘జాతిపిత’గా అభివర్ణించడాన్ని ప్రజలు అంగీకరించరని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Read Also: ప్రోటీన్ ఫైబర్‌తో కిచిడీకి హెల్తీ అప్‌గ్రేడ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>