కలం, వెబ్ డెస్క్ : కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి (Madhusudhana Chari) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. హార్వర్డ్ వెళ్లినా.. అంతరిక్షం వెళ్లినా సీఎం రేవంత్ బుద్ధి మారదు అని విమర్శించారు. సీఎం వ్యాఖ్యలు సిట్ (SIT) విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునా విచారణకు కేసీఆర్ టైమ్ కోరారని, అంతేతప్ప విచారణకు రాలేనని చెప్పలేదన్నారు. ‘రెండేళ్లలో ఎన్నో విచారణలు ఎదుర్కొన్నాం.. దేనికి భయపడం.. కేసీఆర్ ముమ్మాటికీ జాతిపితే‘ అని తేల్చి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ (KCR) ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారన్నారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ప్రమేయం లేదని.. తన చిల్లర బుద్ధిని చాటుకుంటూ కేసీఆర్‌పై అదే పనిగా పిచ్చి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు తప్ప, చేతలు లేవన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని మధుసూదనాచారి (Madhusudhana Chari) డిమాండ్ చేశారు.
Read Also: KCR ఎంక్వయిరీ టైమ్‌లో సంతోష్ లేడెందుకు? బీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ
Follow Us On: Youtube


