కలం, వెబ్ డెస్క్ : సమాజంలో మానవత్వం రోజురోజుకు కనుమరుగవుతుంది. ఎవరెలాపోతే మనకేంటి అనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. పనివాళ్లపై కనీసం దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో చర్చకు దారితీసింది. పార్సిల్ అందజేయడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్ కి అపార్డుమెంట్ వాళ్లు లిఫ్ట్ ఎక్కనివ్వకుండా నిరాకరించారు (Lift Denial). దీంతో చేసేదేమీ లేక.. వెనకడుగు వేయకుండా 6 అంతస్తులు మెట్లగుండా ఎక్కాడు.. అది కూడా భారీ సైజులో ఉన్న పార్సిల్ ఎత్తుకుని. డెలివరీ ఏజెంట్ మెట్లెక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి అమానవీయం అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. డెలివరీ ఏజెంట్ పట్టుదలకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు.
అమానుష ఘటన : లిఫ్ట్ లోకి రానివ్వకపోవడంతో భారీ పార్శిల్‌తో 6 అంతస్తులు మెట్లెక్కిన డెలివరీ ఏజెంట్!
అదుపు తప్పి పడిపోబోయినప్పటికీ, ఇంటి యాజమాని కేవలం "ఆరామ్‌సే.. జాగ్రత్త" అనే మాటలతోనే సరిపెట్టారు.
వీడియో వైరల్ కావడంతో ఇంటి యాజమాని తీరుపై, అపార్టుమెంట్ నిర్వాహకులపై నెటిజన్లు తీవ్ర… pic.twitter.com/vYgflpeWJ9— Kalam Daily (@kalamtelugu) February 2, 2026
Read Also: పాక్‌ను బెంబేలెత్తిస్తున్న బలూచ్ ఆత్మాహుతి దళం మహిళలు
Follow Us On: Sharechat


