epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నిజాయితీగా పోరాడాం.. జూబ్లీ ఫలితాలపై కేటీఆర్

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నిక ఫలితాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. తాము ఈ పోరులో నిజాయితీగా పోరాడామని, కానీ ఫలితాలు నిరుత్సాహ పరిచాయని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈసారి మరింత కసితో పనిచేస్తామని వెల్లడించారు. రాజకీయాల్లో విజయం, పరాజయాలు సహజమన్న కేటీఆర్… మనం నిలకడగా ముందుకు సాగాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకూ మన ప్రయత్నం ఆగకూడదని కేడర్ కి పిలుపునిచ్చారు.

ఈ ఉప ఎన్నిక ఫలితం తమ పార్టీకి క్రొత్త ఉత్సాహం మరియు శక్తిని ఇచ్చిందని, రాష్ట్ర రాజకీయాల్లో యథార్థ ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్(BRS) మాత్రమేనని ప్రజలు స్పష్టంగా తెలియజేశారని కేటీఆర్(KTR) పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల సమస్యలపై పార్టీ నిరంతర పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,711 వేల ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.

Read Also: రెండు ఓటములు.. చివరకు గెలుపు

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>