epaper
Friday, January 16, 2026
spot_img
epaper

బండి సంజయ్ అంచనాలు ఫెయిల్

కలం డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అంచనాలు తలకిందులయ్యాయి. ఇది హిందు-ముస్లిం మధ్య జరుగుతున్న యుద్ధం.. హిందువులంతా ఐక్యంగా ఉండి బీజేపీకి ఓటేయాలి.. కాంగ్రెస్ పార్టీ ముస్లింలపై ప్రేమ చూపుతూ అప్పీజ్‌మెంట్ పాలిటిక్స్ (బుజ్జగింపు రాజకీయాలు)కు పాల్పడుతున్నది.. బీఆర్ఎస్ సైతం అదే తరహాలో వ్యవహరిస్తున్నది… ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సెక్యులర్ ముసుగు తగిలించుకుని హిందువులకు అన్యాయం చేస్తున్నాయి.. బీజేపీ(BJP) ఒక్కటే హిందు పార్టీగా ఉన్నది… ఇక్కడ గెలిచిన తర్వాత జూబ్లీహిల్స్ పేరును సీతారామ్ నగర్‌గా మారుస్తాం.. ఇలాంటి అనేక కామెంట్లు చేసి విమర్శల పాలయ్యారు. హిందు, ముస్లిం మత విభజన తెచ్చి ఆరోపణలు చేయడాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

బీజేపీ ఒక్కటే హిందు ధర్మాన్ని పరిరక్షిస్తుంది… హిందువులంతా సింగిల్ ఓటుతో బీజేపీని గెలిపిస్తారు.. ముస్లిం మైనారిటీ ఓట్లు మాకు అవసరం లేదు.. సెక్యులరిజంకు ఇది రిఫరెండంగా నిలుస్తుంది.. హిందువులంతా బీజేపీవైపే ఉన్నారని రుజవవుతుంది.. బీజేపీ గెలుపుతో హిందు రామరాజ్యం అనే స్ఫూర్తికి హిందు ఓటర్లు ఒక్కటవుతారు.. ఒకవేళ బీజేపీ ఓడినట్లయితే అది సెక్యులరిజం ముసుగు వేసుకున్న కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ అప్పీజ్‌మెంట్‌కు పట్టం కట్టినట్లవుతుంది.. బండి సంజయ్(Bandi Sanjay) ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్లు చేసినా చివరకు జూబ్లీ హిల్స్ ఓటర్లు మాత్రం ఆ పార్టీకి డిపాజిట్ కూడా ఇవ్వలేదు.

Read Also: డిపాజిట్ కోల్పోయిన బీజేపీ.. సీఎం రేవంత్ అంచనా కరెక్ట్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>