మహారాష్ట్రలోని పుణే(Pune) నవాలే వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు ఆరు వాహనాలను ఢీకొట్టింది. ఈ క్రమంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మరోవైపు, కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించబడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని, చికిత్స అవసరమైన వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు అధిక వేగంతో వెళ్తున్న కారణంగా ఈ ప్రమాదం జరిగింది అని భావిస్తున్నారు. అధికారులు ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణం, ట్రాఫిక్ నియమాలపై ఉల్లంఘనలు, డ్రైవర్ అవగాహనలో లోపాలు వాహన నిర్వహణ సమస్యలు ఉండవచ్చని సూచిస్తున్నారు.
Read Also: మహాగఠ్‌బంధన్ అస్తమిస్తుంది.. బీజేపీ సెటైర్లు
Follow Us on: Instagram

