epaper
Tuesday, November 18, 2025
epaper

మహాగఠ్‌బంధన్ అస్తమిస్తుంది.. బీజేపీ సెటైర్లు

బీహార్ ఎన్నికల కౌంటింగ్ వేళ ప్రత్యర్థి మహాగఠ్‌బంధన్ కూటమిపై బీజేపీ(BJP) సెటైర్లు వేస్తోంది. భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న క్రమంలో ఎన్‌డీఏ(NDA) విజయం దాదాపు ఖరారయినట్లు కనిపిస్తోంది. దీంతో ప్రత్యర్థి కూటమిపై బీజేపీ.. సెటైర్లు వేస్తోంది. అదే విధంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి చురకలంటిస్తోంది. ఎన్నికల లెక్కింపు ప్రారంభమైన వెంటనే ఎన్డీయే గట్టి ఆధిక్యంలోకి రావడంతో, భాజపా జాతీయ ప్రతినిధి జైవీర్ షెర్గిల్(Jaiveer Shergill) ప్రతిస్పందించారు. లెక్కింపు వేగం చూస్తుంటే మధ్యాహ్నానికి భాజపా కార్యాలయాలు సంబరాల్లో మునిగిపోతాయని, అదే సమయంలో ప్రతిపక్షాలు తమ కార్యాలయాలపై తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

విదేశాల్లో ఉన్న రాహుల్ గాంధీ ఇంకా మేల్కొంటున్నా ఇక్కడ ఎన్డీయే విజయం ధ్రువీకృతమవుతూ పోతుందని ఆయన విమర్శించారు. రాహుల్‌ అక్కడ ఉదయాన్ని చూస్తే సరిపోతుంది, అప్పటికే బీహార్‌లో మహాగఠ్‌బంధన్ సూర్యాస్తమయం చూస్తుందని కటువుగా చురకలు వేశారు. ఇది కేవలం రాజకీయ తీర్పే కాదు, జెన్-జెడ్ ఓటర్లు స్పష్టంగా ఎన్డీయే వైపే మొగ్గు చూపారనడానికి ఇదే నిదర్శనమని, రాహుల్ గాంధీ మరియు తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని షెర్గిల్(Jaiveer Shergill) వ్యాఖ్యానించారు. బీహార్ ప్రజలు అరాచకానికి ముగింపుపలకాలని నిర్ణయించుకున్నారనే దానికి ఈ ఫలితాలు స్పష్టమైన సంకేతాలని కూడా ఆయన తెలిపారు.

Read Also: ఆత్మరక్షణలో బీఆర్ఎస్… కేడర్ కష్టాలు తప్పవా??

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>