కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించాయి. క్యాన్సర్ ఆస్పత్రి రోడ్డు నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడుకున్నారు. రోడ్డుపై బైఠాయించి బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు బీఆర్‌ఎస్ (BRS) కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ విచారణ సందర్భంగా పోలీసులు నందినగర్‌లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అడుగడుగునా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు.
Read Also: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Follow Us On : WhatsApp


