epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

బడ్జెట్ ఎఫెక్ట్​ : ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే..

కలం, వెబ్ డెస్క్​ : కేంద్ర బడ్జెట్ (Budget 2026) ను విత్త మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​ లో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక పద్దులో నిర్మలమ్మ సామాన్యలకు కొన్ని తీపి కబుర్లు చెబితే మరికొన్ని చేదు విషయాలను వెల్లడించింది. అత్యవసర మందులు, ఈవీ బ్యాటరీస్, స్మార్ట్ ఫోన్లు లాంటి వస్తువుల ధరలు తగ్గనుండగా లగ్జరీ వాచ్​ లు, ఫెర్టీలైజర్లు రేట్లు పెరిగే అవకాశాలున్నాయి.

చౌకగా లభించే వస్తువులు : మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడి భాగాలు, బంగారం, వెండి, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, క్యాన్సర్, షుగర్ మందులు, టెలికాం పరికరాలు, సీఎన్‌జీ, బయోగ్యాస్ ధరలు, చెప్పులు, షూలు, మత్స్యకారులు పట్టిన చేపలు, లెదర్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

ధరలు పెరిగేవి : లిక్కర్ ధరలు, విదేశీ కార్లు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రి, బొగ్గుపై పన్నులు, సిగరెట్లు, పోగాకు ధరలు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Read Also: పర్యావరణ సవాళ్లపై పోరాటానికి అరకొరే

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>