కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కేసీఆర్‌కి మరోసారి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆయనను ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో విచారణకు హాజరుకావాలని కోరింది. సిట్ నోటీసులు చట్టవిరుద్ధం అని కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్‌కు సిట్ నోటీసులు అందడంపై విమర్శలొస్తున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పందించారు.
తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధింపు లేదన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేసేదే ఉంటే.. రెండేళ్లలో ఎప్పుడో చేసేదని, తమకు ఎవరిపై కక్ష సాధింపు లేదని మంత్రి (Minister) శ్రీధర్ బాబు అన్నారు.


