కలం, నల్లగొండ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) షెడ్యూల్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. నల్లగొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మిర్యాలగూడ సభలో సీఎం పాల్గొననున్నారు. అయితే ఈ సభను ఫిబ్రవరి మూడో తేదీన నిర్వహించేందుకు మొదటగా షెడ్యూల్ ఖరారు అయింది. కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్లో మార్పు చోటు చేసుకోవడంతో మిర్యాలగూడకు సీఎం ఫిబ్రవరి 4వ తేదీన రానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారు అయింది.
కాంగ్రెస్ శ్రేణులు ఆ మేరకు సన్నద్ధం కానున్నారు. ఇదిలా ఉంటే.. మిర్యాలగూడ కాంగ్రెస్ లో కౌన్సిలర్ల టికెట్ల వ్యవహారంలో గందరగోళం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఇంటి నుంచి ముగ్గురు కుటుంబ సభ్యులకు కౌన్సిలర్లుగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో స్థానిక కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి మొదలైంది. అయితే ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు ఇప్పటికే నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి () రంగంలోకి దిగారు. కానీ పరిస్థితి ఇప్పటికిప్పుడు సద్దుమణిగేలా లేదు. ఇలాంటి పరిస్థితులు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సభ వాయిదా పడడం కొంతమేర ఉపశమనం కలిగిస్తుందని చెప్పాలి.
Read Also: ’హార్వర్డ్’ లో స్టూడెంట్లతో సీఎం రేవంత్ చర్చలు.. కీలక సూచనలు
Follow Us On: X(Twitter)


