కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) 2026 ముందు ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు జరిగింది. వెన్ను గాయం కారణంగా ప్యాట్ కమిన్స్ టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అతని స్థానంలో ఎడమచేతి పేసర్ బెన్ డ్వార్షుయిస్‌ను తుది 15 మంది జట్టులోకి చేర్చారు. అలాగే మాథ్యూ షార్ట్‌ను తొలగించి మ్యాట్ రెన్‌షాను ఎంపిక చేశారు. కమిన్స్ ఫిట్ అవుతాడన్న అంచనాలు ఉన్నప్పటికీ దిగువ వెన్ను సమస్యలు కొనసాగడంతో పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం అవసరమని సెలెక్టర్లు నిర్ణయించారు. అతను డిసెంబర్ మధ్య నుంచి పోటీ క్రికెట్ ఆడలేదు.
డ్వార్షుయిస్ ఎంపికపై సెలెక్టర్ టోనీ డోడెమైడ్ స్పందిస్తూ స్వింగ్ బౌలింగ్ చేయగల పేస్ ఆప్షన్ కావడంతో అతన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఫీల్డింగ్‌లో చురుకుదనం, చివర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కూడా అతనికి ప్లస్ అవుతుందని పేర్కొన్నారు. రెన్‌షా ఇటీవల మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు ఎడమచేతి బ్యాట్స్‌మన్‌గా మిడిల్ ఆర్డర్‌కు ప్రత్యేకత తీసుకొస్తాడని సెలెక్టర్లు భావించారు. ఇదే సమయంలో బిగ్ బాష్‌లో ఫామ్‌లో ఉన్నప్పటికీ స్టీవెన్ స్మిత్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు.
ఆస్ట్రేలియా తుది జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జాంపా, బెన్ డ్వార్షుయిస్, మ్యాట్ రెన్‌షా సహా 15 మంది సభ్యులు ఉన్నారు.
Read Also: ఖేలో ఇండియా వింటర్ గేమ్స్: నయనా శ్రీకి డబుల్ గోల్డ్
Follow Us On: Sharechat


