కలం, వెబ్ డెస్క్: పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నా.. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో డ్రగ్స్ (Drugs) సరఫరాకు బ్రేక్ పడటం లేదు. అంతర్రాష్ట్ర డ్రగ్ మాఫియా నెట్‌వర్క్ తెలంగాణను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో డ్రగ్స్ వినియోగం, సరఫరా పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యువత, కాలేజీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్ పెడ్లర్లు పనిచేస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో శనివారం శంషాబాద్ (Shamshabad) ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.9.5 కోట్లు విలువ చేసే 27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ ప్రయాణికులతో సహా ఏడుగురుని అరెస్ట్ చేశారు. NDPS చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: ఆపరేషన్ స్మైల్.. 5వేల మంది చిన్నారులకు విముక్తి
Follow Us On: Pinterest


